'డీజే' టీజర్కు ముహుర్తం ఫిక్స్ | Dj teaser to be released on Shiva Rathri | Sakshi
Sakshi News home page

'డీజే' టీజర్కు ముహుర్తం ఫిక్స్

Feb 22 2017 10:07 AM | Updated on Sep 5 2017 4:21 AM

'డీజే' టీజర్కు ముహుర్తం ఫిక్స్

'డీజే' టీజర్కు ముహుర్తం ఫిక్స్

సరైనోడు సినిమాతో బాక్లబస్టర్ సక్సెస్ సాధించిన అల్లు అర్జున్ త్వరలో డీజే దువ్వాడ జగన్నాథమ్గా

సరైనోడు సినిమాతో బాక్లబస్టర్ సక్సెస్ సాధించిన అల్లు అర్జున్ త్వరలో డీజే దువ్వాడ జగన్నాథమ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కామెడీ యాక్షన్ సినిమాలను తెరకెక్కించే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. చాలా కాలం తరువాత దిల్ రాజు తన సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తుండటంతో డీజేపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

అందుకు తగ్గట్టుగా ఇటీవల విడుదలైన డీజే ఫస్ట్ లుక్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్తో ఆకట్టుకున్న డీజే టీం, త్వరలో టీజర్తో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 24 ఉదయం 9 గంటలకు డీజే టీజర్ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్త ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement