గోవా నుంచి రిటర్న్‌ అయిన ‘డిస్కో రాజా’ | Disco Raja Goa Schedule Wrapped Up | Sakshi
Sakshi News home page

గోవా నుంచి రిటర్న్‌ అయిన ‘డిస్కో రాజా’

Sep 15 2019 11:26 AM | Updated on Sep 15 2019 2:16 PM

Disco Raja Goa Schedule Wrapped Up - Sakshi

మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డిస్కో రాజా. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభానటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ గోవా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేశారు.

ఎస్‌ఆర్‌టీ మూవీ బ్యానర్‌పై రామ్‌ తళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా తమన్‌ సం‍గీతమందిస్తున్నాడు. వెన్నెల కిశోర్‌, తాన్యా హోపేలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొంత కాలంగా సరైన హిట్స్‌ లేక ఇబ్బందుల్లో ఉన్న రవితేజ, డిస్కోరాజా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్‌ మహరాజ్‌ రెండు డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా డిసెంబర్‌ 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement