నిర్మాతగా మారుతున్న మరో స్టార్ డైరెక్టర్ | Director Vinayak To turn producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా మారుతున్న మరో స్టార్ డైరెక్టర్

Mar 3 2016 11:22 AM | Updated on Sep 3 2017 6:51 PM

నిర్మాతగా మారుతున్న మరో స్టార్ డైరెక్టర్

నిర్మాతగా మారుతున్న మరో స్టార్ డైరెక్టర్

టాలీవుడ్ హీరోలతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఆర్థికంగా స్థిరపడటానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే స్టార్ హీరోలందరూ నిర్మాణ రంగం పై దృష్టి పెట్టగా, సుకుమార్, పూరిజగన్నాథ్...

టాలీవుడ్ హీరోలతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఆర్థికంగా స్థిరపడటానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే స్టార్ హీరోలందరూ నిర్మాణ రంగంపై దృష్టి పెట్టగా, సుకుమార్, పూరిజగన్నాథ్ లాంటి దర్శకులు కూడా నిర్మాతలుగా మారారు. ఇప్పుడు అదే బాటలో మరో స్టార్ డైరెక్టర్ కూడా నడవడానికి రెడీ అవుతున్నాడు. ఆది సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన వినాయక్ త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించనున్నాడట.

అఖిల్ సినిమా రిజల్ట్ తో ఢీలా పడ్డ వినాయక్ ప్రస్తుతం, చిరు రీ ఎంట్రీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత తన సొంతం నిర్మాణ సంస్థ ద్వారా లో బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా త్వరలోనే వినాయక్ నిర్మాత గా మారే అవకాశం మాత్రం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement