మమ్ముట్టి నటన అద్భుతం : డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి

DIrector Surender Reddy Comment On Yatra Movie - Sakshi

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. రాజన్న పాత్రలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి జీవించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. పాజిటివ్‌ రివ్యూలతో, మంచి టాక్‌తో అందరి మన్నలను అందుకున్న ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.

ఇప్పటికే ఈ మూవీపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి ఈ సినిమా వీక్షించి తన అభిప్రాయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ యాత్ర చూశాను. ఇదొక ఎమోషనల్‌ జర్నీ. చాలా సందర్భాల్లో ఎమోషనల్‌ అయ్యాను. రాజన్నే స్వయంగా తెరపైకి వచ్చాడేమో అనేంతలా.. మమ్ముట్టి గారు అద్భుతంగా నటించారు. చిత్రానికి పనిచేసిన నటీనటులు, చిత్రయూనిట్‌ సభ్యులందరికీ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు. సురేందర్‌ రెడ్డి ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top