వర్మ తప్పుచేశాడన్న పూరి | Director Puri Jagannath Comments On Pawan Kalyan Issue | Sakshi
Sakshi News home page

Apr 20 2018 12:20 PM | Updated on Mar 22 2019 5:33 PM

Director Puri Jagannath Comments On Pawan Kalyan Issue - Sakshi

పవన్‌ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో శ్రీరెడ్డి వివాదం మరో మలుపు తిరిగింది. రామ్‌ గోపాల్‌ వర్మ స్వయంగా తానే ఈ కామెంట్‌ చేయించానని చెప్పటంతో వివాదం మరింత ముదిరింది. మెగా ఫ్యామిలీతో అంతా ఒక్కతాటిపైకి రావటంతో అభిమానుల నుంచి కూడా మద్ధుతు పెరుగుతుంది.

తాజాగా ఈ వివాదం వర్మ శిష్యుడు, దర్శకుడు పూరి జగన్నాథ్‌ స్పందించారు. ‘నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధపడటం నాకు చాలా బాధ కలిగించింది . అతనిని ఎప్పుడూ ఇలా చూడలేదు . ఆర్జీవీ చేసిన పని నాకు నచ్చలేదు  ప్రాణం ఉన్నంత వరకూ ఐ సపోర్ట్‌ పవన్‌ కల్యాణ్’ అంటూ ట్వీట్‌ చేశారు పూరి.

పూరి వ్యాఖ్యలపై స్పందించిన రామ్‌ గోపాల్‌ వర్మ ‘మీ ఆవేదన నాకు అర్ధమైంది. నేను పోరపాటు చేశాను. ఇప్పటికే క్షమాపణ కూడా కోరాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement