ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో హాలీవుడ్ చిత్రం ఎమీ | Director of the Hollywood Movie Amy, RP Patnaik | Sakshi
Sakshi News home page

ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో హాలీవుడ్ చిత్రం ఎమీ

Sep 22 2013 12:53 AM | Updated on Sep 1 2017 10:55 PM

ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో హాలీవుడ్ చిత్రం ఎమీ

ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో హాలీవుడ్ చిత్రం ఎమీ

‘‘అమెరికాలో ‘అమీష్ కమ్యూనిటీ’ అని ఒకటుంది. వాళ్లు... మనుషులు కనిపెట్టిన కరెంట్, వాహనాల్లాంటివి వాడరు. ప్రకృతి సిద్ధమైనవాటినే వినియోగిస్తారు.

‘‘అమెరికాలో ‘అమీష్ కమ్యూనిటీ’ అని ఒకటుంది. వాళ్లు... మనుషులు కనిపెట్టిన కరెంట్, వాహనాల్లాంటివి వాడరు. ప్రకృతి సిద్ధమైనవాటినే వినియోగిస్తారు. ఈ తెగ నేపథ్యంలో చేసిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది’’ అన్నారు ఆర్పీ పట్నాయక్. సంగీత దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా తెలుగులో తన ప్రతిభ చాటుకున్న ఆర్పీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమీ. ఈ చిత్రం ద్వారా ఆయన హాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. టీపీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రసాద్ కూనిశెట్టి, రమేష్ నూతి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 1న ఈ చిత్రం ‘వీఓడి’ (వీడియో ఆన్ డిమాండ్) ద్వారా విడుదల చేయనున్నారు. 
 
అంటే... థియేటర్లలో కాకుండా ఇంటర్నెట్ ద్వారా విడుదల చేస్తారు. అదే రోజున ఈ చిత్రం డీవీడీ కూడా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను ఆర్పీ చెబుతూ -‘‘ఇది ఇండియన్ ఇంగ్లిష్ మూవీ కాదు. కంప్లీట్ హాలీవుడ్ మూవీ. ఇలా పూర్తి స్థాయి హాలీవుడ్ చిత్రం చేసిన తొలి తెలుగువాళ్లం మేమే’’ అని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ కూనిశెట్టి మాట్లాడుతూ -‘‘ఈ చిత్రనిర్మాణానికి రెండేళ్లు పట్టింది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత జాన్ షీన్‌బర్గ్ ఈ చిత్రం నచ్చి, మార్కెటింగ్ చేయడానికి ముందుకు రావడం ఆనందంగా ఉంది. తెలుగులో విడుదల చేయమని చాలామంది కోరుతున్నారు. దాని గురించి తర్వాత ఆలోచిస్తాం’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement