బాబాయ్ తరువాత అబ్బాయితో..! | Director Krish Next Film with NTR | Sakshi
Sakshi News home page

బాబాయ్ తరువాత అబ్బాయితో..!

Dec 20 2016 12:11 PM | Updated on Sep 4 2017 11:12 PM

బాబాయ్ తరువాత అబ్బాయితో..!

బాబాయ్ తరువాత అబ్బాయితో..!

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం, గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్, తన తరువాతి ప్రాజెక్ట్ ప్లాన్స్ కూడా మొదలెట్టేశాడు.

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం, గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్, తన తరువాతి ప్రాజెక్ట్ ప్లాన్స్ కూడా మొదలెట్టేశాడు. ఇప్పటికే నెక్ట్స్ సినిమా కోసం ఓ లైన్ కూడా రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తన నెక్ట్స్ సినిమాను ఓ స్టార్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరోతో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు క్రిష్.

ఇటీవల జనతా గ్యారేజ్ సినిమాతో తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న ఎన్టీఆర్తో తన నెక్ట్స్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్కు తగ్గ లైన్ ను సిద్ధం చేసిన క్రిష్, గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ తరువాత ఎన్టీఆర్కు కథ వినిపించాలని భావిస్తున్నాడట. అయితే ఇప్పటికే బాబీ సినిమా పనులు మొదలు పెట్టిన జూనియర్, ఆ తరువాత త్రివిక్రమ్తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత 2018లో క్రిష్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement