దర్శకుడు బీరం మస్తాన్‌రావు కన్నుమూత

దర్శకుడు బీరం మస్తాన్‌రావు   కన్నుమూత

సీనియర్ దర్శకుడు బీరం మస్తాన్‌రావు(70) మంగళవారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు. కృష్ణ, శ్రీదేవి నటించిన ‘బుర్రిపాలెం బుల్లోడు’తో దర్శకునిగా పరిచయమైన ఆయన... ఎన్టీఆర్‌తో ‘ప్రేమ సింహాసనం’ చేశారు. అటుపై విప్లవ శంఖం, తల్లి గోదావరి మొదలగు ఎనిమిది చిత్రాలకు దర్శకత్వం వహించారు. చంద్రమోహన్, జయశ్రీ జంటగా నటించిన ‘సువర్ణ సుందరి’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

 

  పలు టీవీ సీరియళ్లను కూడా తెరకెక్కించిన మస్తాన్‌రావు, కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన ‘రైల్వే కూలీ’లో విలన్‌గా చేశారు. త్వరలో విడుదల కానున్న ‘యామినీ చంద్రశేఖర్’ చిత్రంలో కూడా ఆయన నటించారు. మస్తాన్‌రావు తొలి భార్య నవీనలక్ష్మి 2005లో కన్నుమూశారు. దీంతో చిన్ననాటి స్నేహితురాలైన దేవీని మస్తాన్‌రావు ద్వితీయ వివాహం చేసుకున్నారు. హైదరాబాదులో స్థిరపడిన బీరం మస్తాన్‌రావు రెండు నెలల క్రితం చెన్నై వెళ్లారు. అక్కినేని అంత్యక్రియలను టీవీలో చూస్తూ బాధతో గుండెపోటుకు గురయ్యారని,ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఆసుపత్రిలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు బుధవారం ఉదయం చెన్నైలో శ్మశాన వాటికలో జరగనున్నాయి.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top