తొలి సెల్ఫీ ఫోటో వైరల్‌ 

Dil Raju First Selfie Photo With His Wife Viral In Social Media - Sakshi

టాలీవుడ్‌ బడా నిర్మాత దిల్‌ రాజు రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆదివారం రాత్రి నిజామాబాద్‌ జిల్లాలోని నర్సింగ్‌పల్లిలో దిల్‌ రాజు ఇష్టదైవం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా నిరాడంబరంగా తేజస్వినితో ఆయన వివాహం జరిగింది. దీంతో గత రెండు రోజులుగా ఈ బడా నిర్మాత పెళ్లి టాపిక్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా రాజు-తెజస్వినిలకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

వివాహం తర్వాత శ్రీమతితో దిల్‌ రాజు దిగిన తొలి సెల్ఫీ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కొత్త జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇక దిల్‌ రాజును వివాహం చేసుకున్న తేజస్విని గురించి తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్‌లో వెదుకులాట ప్రారంభించారు. అయితే ఆమె గురించి ఎలాంటి అధికారిక సమాచారం ఇప్పటివరకు తెలియలేదు. ఇక దిల్‌ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి:
రెండో వివాహం చేసుకున్న దిల్‌ రాజు
‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020లో’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top