కుర్ర హీరోయిన్లే కావాలా?

Dia Mirza Slams Makers Star Heroes for Chances - Sakshi

ఒక హీరోయిన్‌కు 30 ఫ్లస్‌ దాటాయంటే.. ఆమెకు ఛాన్స్‌లు తగ్గిపోవటం ఇండస్ట్రీలో కామన్‌గా మారింది(కొందరిని మినహాయిస్తే...). ఆ జాబితాలో బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా(37) కూడా ఉన్నారు. సుమారు ఆరేళ్ల తర్వాత బాలీవుడ్‌లో ఆమె రణ్‌బీర్‌ కపూర్‌ ‘సంజు’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో మాన్యతాదత్‌ పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు. 

‘ఒక నటీమణికి 30 ఏళ్లు వచ్చాయంటే, క్రమక్రమంగా ఆమెకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. దర్శక నిర్మాతలు యంగ్‌ హీరోయిన్లే కావాలని కోరుకుంటున్నారు. అంతెందుకు 50 ఏళ్లు దాటిన మన హీరోలు కూడా పడుచు అమ్మాయిలతోనే జత కట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏం? అందరికీ కుర్రహీరోయిన్లే కావాలా? మిగతా వాళ్లు  నటనకు పనికిరారా?’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ..‘ఇక్కడ టాలెంట్‌తో పని లేదు. కేవలం ఫ్రెష్‌ ఫేస్‌ల కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్క బాలీవుడ్‌ మాత్రమే కాదు. మిగతా ఇండస్ట్రీల్లోనూ ఇదే పరిస్థితి. సినిమా రంగంలో మార్పులు వస్తున్నాయి. మరి యాక్టర్ల జీవితంలో మార్పు రాకూడదా?.. పర్సనల్‌ లైఫ్‌తోపాటు ప్రొఫెషనల్‌ లైఫ్‌ కోరుకోవటం తప్పేం కాదు కదా!’ అని ఆమె తెలిపారు.

‘అయితే వివాహం అయ్యాక కూడా కెరీర్‌ను తమ టాలెంట్‌తో అద్భుతంగా మలుచుకున్న వాళ్లూ లేకపోలేదు. ఉదాహరణకు షర్మిలా ఠాగూర్‌, వహీదా రెహమాన్‌, స్మితా పాటిల్‌లు.. పెళ్లయ్యాక కూడా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌ గా కొనసాగించారు. నేను కూడా వాళ్ల బాటలోనే పయనించాలని నిర్ణయించుకున్నా. అందుకే మంచి కథల కోసం ఇంత కాలం ఎదురు చూశా. మధ్యలో ఓ ఇరానియన్‌ చిత్రం చేస్తున్న సమయంలో దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ నుంచి కబురు అందింది. దాదాపు రెండేళ్ల తర్వాత సంజు కార్యరూపం దాల్చింది. సంజుతో మంచి చిత్రంలో నటించాననే కోరిక తీరింది’ అని దియా ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top