
ఆగస్టు 15న మెగా అభిమానులకు చెర్రీ గిఫ్ట్
మెగా ఫ్యామిలీ అభిమానులకు ఈ ఆగస్టు 15న రామ్ చరణ్ తేజ(చెర్రీ) మంచి గిఫ్ట్ ఇవ్వనున్నారు.
హైదరాబాద్: మెగా ఫ్యామిలీ అభిమానులకు ఈ ఆగస్టు 15న రామ్ చరణ్ తేజ మంచి గిఫ్ట్ ఇవ్వనున్నారు. ఆయన నటిస్తున్న ధృవ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ ఆగస్టు 15న ఈ సినిమా ధృవ ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు చెర్రీ. బ్రూస్ లీ సినిమాతో నిరాశపరిచిన చరణ్ వీలైనంత త్వరగా అభిమానులను సక్సెస్తో పలకరించాలని భావిస్తున్నాడు.