ఆదిత్య వర్మ రెడీ | Dhruv Vikram's turn to play Arjun Reddy tamil remake | Sakshi
Sakshi News home page

ఆదిత్య వర్మ రెడీ

Jun 17 2019 3:30 AM | Updated on Jun 17 2019 3:30 AM

Dhruv Vikram's turn to play Arjun Reddy tamil remake - Sakshi

ధృవ్‌ విక్రమ్‌

‘అర్జున్‌ రెడ్డి’ తమిళ రీమేక్‌ పడాల్సిన ఇబ్బందులు పడింది. చూడాల్సిన చిక్కులు చూసేసింది. ఇక ఆడియన్స్‌ సినిమా చూడటమే తరువాయి. ఈ రీమేక్‌ ద్వారా విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. తొలుత ఈ సినిమాని ‘వర్మ’ టైటిల్‌తో బాలా డైరెక్ట్‌ చేశారు. అవుట్‌పుట్‌ నచ్చలేదని నిర్మాణ సంస్థ మళ్లీ మొదటి నుంచి షూటింగ్‌  మొదలెట్టారు. ప్రస్తుతం వర్మ టైటిల్‌ను ‘ఆదిత్య వర్మ’గా మార్చి గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఒరిజినల్‌ ‘అర్జున్‌ రెడ్డి’ డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో గిరీశయ్య పని చేయడం విశేషం. ఇందులో  బన్నితా సంధు, ప్రియా ఆనంద్‌ కథానాయికలు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయింది. టీజర్‌ ఆదివారం రిలీజ్‌ అయింది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిందట. రిలీజ్‌కు ‘ఆదిత్య వర్మ’ రెడీ అంటోంది చిత్రబృందం.

Advertisement
 
Advertisement
Advertisement