ఫకీర్‌గా వచ్చేస్తున్నాడు..!

Dhanush Movie The Extraordinary Journey Of The Fakir Gets Standing Ovation In Canada - Sakshi

కమర్షియల్‌ హీరోగా కొనసాగుతూనే విభిన్న పాత్రల్లో అలరిస్తున్న విలక్షణ నటుడు తమిళ్‌ హీరో ధనుష్‌. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడైనా ఆ పేరును వాడుకోకుండా తన నటనపై ఆధారపడ్డారు. కోలీవుడ్‌లో స్టార్‌ హీరోగా కొనసాగుతూనే బాలీవుడ్‌లోనూ సక్సెస్‌ఫుల్‌ హీరో అనిపించుకున్నాడు ధనుష్‌. ఇప్పుడు భారత సరిహద్దులు దాటి ప్రపంచ సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. ధనుష్‌ నటించిన ‘ద ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ద ఫకీర్‌’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం కెనాడాలో ఏర్పాటు చేసిన ప్రీమియర్‌ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హీరో ధనుష్‌ నటనకు హాలీవుడ్ సినీ జనాలు కూడా ఫిదా అయ్యారు. ఈ మూవీకి వచ్చిన స్పందనను చిత్ర దర్శకుడు కెన్‌ స్కాట్‌  ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

సినిమాలో ధనుష్‌ నటనకు ప్రేక్షకులంతా మంత్రముగ్ధులయ్యారన్నారు కెన్‌. విడుదలకు ముందే నటుడు ధనుష్‌ స్పెయిన్‌ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడని ట్వీట్‌ చేశారు. దీనికి కృతజ్ఞతలు తెలుపుతూ ధనుష్‌ కూడా ట్వీట్‌ చేశారు. ‘ద ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ద ఫకీర్‌’ చిత్రంలో ధనుష్‌ అజాత శత్రు అనే మెజీషియన్‌ పాత్రలో నటించారు. రొమైన్‌ ప్యుర్తోలస్‌ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పటికే పలు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ధనుష్‌ కూడా ఫకీర్‌ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫ్రాన్స్‌లో జరిగిన ఓ వేడుకలో ధనుష్‌ మాట్లాడుతూ... కోలీవుడ్‌లో హీరో స్థాయి నుంచి విదేశీ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించే స్థాయికి ఎదగటం ఆనందంగా ఉందన్నారు. అందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఓ మామూలు నటుడిగా మొదలై అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ధనుష్‌ కెరీర్‌ కొత్త తరానికి ఆదర్శం అంటున్నారు సినీ విశ్లేషకులు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top