సంచలనాల ఫకీర్‌

The Extraordinary Journey Of The Fakir Might Get You A Chance To Visit Paris - Sakshi

తమిళ క్రేజీ స్టార్‌ ధనుష్‌ హీరోగా రూపొందిన తాజా హాలీవుడ్‌ చిత్రం ‘ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ద ఫకీర్‌’ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. బార్సిలోనా సెయింట్‌ జోర్డి ఫిల్మ్‌ ఫెస్ట్‌లో ఈ సినిమా బెస్ట్‌ కామెడీ మూవీగా ఆడియన్స్‌ ఛాయిస్‌ అవార్డ్‌ అందుకుంది. ఈ నెల 21న మన దేశంతో పాటు మరిన్ని దేశాల్లో ధియేటర్లలో విడుదల కానుంది. జపాన్‌లో మంచి ఆదరణతో చైనాలోనూ విడుదల కానుంది. ఈ చిత్రకథ ఏంటంటే...

వీధి ఇంద్రజాలికుని విశ్వయాత్ర
సౌరభ్‌గుప్తా నిర్మాతగా, ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు కెన్‌స్కాట్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్‌ అజా అనే ఇంద్రజాలికుని పాత్ర పోషించారు. ఒక భారతీయ స్ట్రీట్‌ మెజిషియన్‌ అనూహ్యంగా విదేశాలకు, పారిస్‌ వరకూ చేసిన ప్రయాణం నేపథ్యంగా అల్లుకున్న ఈ సినిమా కథకు రొమైన్‌ పుర్టోలస్‌ రాసిన నవల ఆధారం. అనూహ్యంగా సాగిన ఫకీర్‌ ప్రయాణంతో పాటు శరణార్థుల సమస్యలను కూడా ఈ సినిమా చూపిస్తుంది. ఈ సినిమాలోని ‘మడారి..’ పాట మంచి హిట్‌ నెంబర్‌గా నిలిచింది. ఈ పాటలో ఫ్రెంచ్‌ నటి బెర్నైస్‌ బెజో ధనుష్‌ సరసన నర్తించడం విశేషం. ఈ సందర్భంగా విడుదల చేస్తున్న గోల్డెన్‌ రేషియో ఫిల్మ్స్‌ సిఈఓ అభయానంద్‌ సింగ్‌ మాట్లాడుతూ – ‘‘మాన్‌ సూన్‌ వెడ్డింగ్‌’ తర్వాత అంతటి యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న సినిమా కావడంతోనే హక్కులు తీసుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో రిలీజ్‌ చేస్తున్నాం. సంచలన సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top