'జనతా గ్యారేజ్'లో సుహాసిని | Devayani Replaced with Suhasini In Janata Garage | Sakshi
Sakshi News home page

'జనతా గ్యారేజ్'లో సుహాసిని

Mar 27 2016 1:35 PM | Updated on Sep 3 2017 8:41 PM

'జనతా గ్యారేజ్'లో సుహాసిని

'జనతా గ్యారేజ్'లో సుహాసిని

నాన్నకు ప్రేమతో సినిమా తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జనతాగ్యారేజ్.

నాన్నకు ప్రేమతో సినిమా తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జనతాగ్యారేజ్. మిర్చి, శ్రీమంతుడు లాంటి భారీ హిట్స్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో జనతా గ్యారేజ్పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఆ అంచనాలను మరింతగా పెంచేస్తూ సినిమా కాస్టింగ్ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా, మరో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

తాజాగా మరో సీనియర్ నటి జనతా గ్యారేజ్ టీంతో జాయిన్ అయ్యింది. గతంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రాఖీ, బాద్ షా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన సుహాసిని, జనతా గ్యారేజ్లోనూ నటించనుంది. ఈ సినిమాలో మోహన్ లాల్కు జోడిగా సుహాసినిని ఎంపిక చేశారు. ముందుగా ఈ పాత్రకు తమిళ నటి దేవయానిని సంప్రదించినా, చివరి నిమిషంలో సుహాసినిని ఫైనల్ చేశారు. గతంలో ఎన్టీఆర్, సుహాసిని కలిసి నటించిన రెండు సినిమాలు మంచి విజయం సాధించటంతో సెంటిమెంట్ పరంగా కూడా జనతా గ్యారేజ్కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement