మాధురీ, కరీనాల సరసన దీపిక | Deepika Padukone Wax Statue At Madame Tussauds | Sakshi
Sakshi News home page

మాధురీ, కరీనాల సరసన దీపిక

Jul 23 2018 8:51 PM | Updated on Jul 23 2018 8:54 PM

Deepika Padukone Wax Statue At Madame Tussauds - Sakshi

దీపికా పదుకోన్‌ (ఫైల్‌ ఫోటో)

అందం, అభినయం, అదృష్టం ఈ మూడింటి కలబోతే దీపికా పదుకోన్‌. వరుస విజయాలతో ఇటు బాలీవుడ్‌లోనే కాక హాలీవుడ్‌లోనూ దూసుకుపోతున్న ఈ ‘మస్తాని’కి మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌, న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో దీపికా  మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. ఇప్పటికే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు లండన్‌లో దీపికాను కలిసి ఆమె కొలతలు, ఫొటోలను తీసుకున్నారు.

ఈ సందర్భంగా దీపికా లండన్‌లోని ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ.. ‘ఈ ఫీలింగ్‌ను మాటాల్లో చెప్పలేను. చాలా ఆతృతగానే కాక సంతోషంగా కూడా ఉంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా ఇలాంటి గౌరవం పొంది అభిమానుల సంతోషానికి కారణం కావడం చాలా గొప్ప అనుభూతి. ఈ మ్యూజియం చాలా ప్రత్యేకం. నా మైనపు విగ్రహాన్ని చూసి అభిమానులు ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా’నన్నారు.  అంతేకాక ‘లండన్‌లోని ఈ మ్యూజియాన్ని నా చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఒక్కసారి చూశా’ అని తెలిపారు.

ఈ ఏడాది జనవరిలో  దీపికా ‘పద్మావత్‌’ సినిమాతో పెద్ద హిట్‌ అందుకున్నారు. రాజ్‌పుత్‌ మహారాణి పద్మిని జీవితం ఆధారంగా దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా అనేక వివాదాల మధ్య విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపిక విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికకు జోడిగా ఇర్ఫాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇర్ఫాన్‌ అనారోగ్యంతో బాధపడుతుండటంతో షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement