ఆల్ హ్యాపీస్.. నో వర్రీస్..! | Deepika Padukone to romance with Aamir Khan? | Sakshi
Sakshi News home page

ఆల్ హ్యాపీస్.. నో వర్రీస్..!

Jan 12 2014 12:29 AM | Updated on Sep 2 2017 2:31 AM

ఆల్ హ్యాపీస్.. నో వర్రీస్..!

ఆల్ హ్యాపీస్.. నో వర్రీస్..!

గత ఏడాది దీపికా పదుకొనేకి తీపి గుర్తులనే మిగిల్చిందని చెప్పాలి. వరుసగా నాలుగు విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆమె మార్కెట్ బాగా పెరిగింది.

 గత ఏడాది దీపికా పదుకొనేకి తీపి గుర్తులనే మిగిల్చిందని చెప్పాలి. వరుసగా నాలుగు విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆమె మార్కెట్ బాగా పెరిగింది. వ్యక్తిగతంగా రణవీర్‌సింగ్‌తో ప్రేమాయణం సాగిస్తూ హ్యాపీగా ఉన్నారామె. ఇక, ఈ ఏడాది కూడా ఈ సొట్టబుగ్గల సుందరిదే హవా అని బాలీవుడ్‌వారు అంటున్నారు. ఆల్ హ్యాపీస్.. నో వర్రీస్ అన్న చందంగా దీపికా జీవితం సాగుతోంది. ఇప్పుడు ఆ ఆనందం రెట్టింపు కాబోతోంది. దానికి కారణం ఆమిర్‌ఖాన్. కథానాయిక అయిన ఈ ఏడేళ్లల్లో ఎంతోమంది స్టార్ హీరోస్ సరసన నటించిన దీపికాకి ఆమిర్‌ఖాన్,
 
 సల్మాన్‌ఖాన్, హృతిక్‌రోషన్ సరసన మాత్రం నటించే అవకాశం రాలేదు. ఇటీవల పలువురు బాలీవుడ్ ప్రముఖులకు తను ఇచ్చిన సక్సెస్ పార్టీలో కూడా దీపికా ఈ విషయం గురించే ప్రస్తావించారు. ఇది జరిగి నెల కూడా కాలేదు. ఈలోపు ఆమిర్ సరసన నటించే అవకాశం కొట్టేశారట. ఆమిర్ హీరోగా ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ సంయుక్తంగా నిర్మించనున్న ఓ చిత్రంలో దీపికాని కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. జూలై లేక ఆగస్ట్‌లో ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారని వినికిడి. ప్రస్తుతం ఆమిర్, దీపికాతో సంప్రదింపులు జరుపుతున్నారట. అధికారికంగా సైన్ చేసిన తర్వాత దీపికా ఈ చిత్రం గురించి చెప్పాలనుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement