పద్మావత్ తర్వాత దీపికకు ఏమైంది..!

Deepika Padukone Take Rest After Padmaavat Movie - Sakshi

సాక్షి, ముంబై: వివాదస్పద మూవీ పద్మావత్‌ తర్వాత బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. అయితే అందుకు కారణాలివే అంటూ కొన్ని వదంతులు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. పద్మావత్ మూవీ రణ్‌వీర్‌ సింగ్‌కు ఎంత పేరు తెచ్చిందో దీపికకు అంతకంటే ఎక్కువ ఫేమస్ అయ్యారు. ఈ మూవీ తర్వాత కొందరు డైరెక్టర్లు తమ స్టోరీ లైన్ వినిపించేందుకు వెళ్లగా హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుందని ఆమె తెలుసుకుంటున్నారట.

గతంలో తాను చేసిన మూవీల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉన్న స్టోరీలు కాకపోవడంతో ఏ ప్రాజెక్టుకు ఆమె ఓకే చెప్పడం లేదని ప్రచారం జరుగుతోంది. కాగా, హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన  ఈ పొడుగుకాళ్ల సుందరి.. తర్వాతి ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. హీరోలతో పోటీపడి నటించి మెప్పించే క్యారెక్టర్ ఉన్న స్టోరీలు తన వద్దకు వస్తే కచ్చితంగా చేస్తానని దీపిక గతంలో చాలాసార్లు పేర్కొన్నారు. కాగా, అనారోగ్య కారణాల వల్లే మూవీలకు కాస్త గ్యాప్ ఇచ్చారని దీపిక సన్నిహిత వర్గాల సమాచారం.

ఏది ఏమైతేనేం పద్మావత్ తర్వాత ఆమె తాజా ప్రాజెక్టులపై అప్‌డేట్స్ అంతగా లేవు. దీపికను తెరపై మళ్లీ ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్‌’ వంటి చారిత్రక సినిమాల్లో తన నటనతో మెప్పించిన దీపికకు ‘మహాభారతం’ సినిమాలో ద్రౌపది పాత్రకు ఆమె అయితేనే కరెక్ట్‌గా సరిపోతారని ఆమిర్‌ చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top