సెల్‌కు సెలవు

Deepika Padukone, Ranveer Singh Wedding in Mobiles Not Allowed - Sakshi

గిఫ్ట్స్‌ తీసుకురాక పోయినా పర్లేదు కానీ తమ పెళ్లి వేడుకకు మొబైల్స్‌ని తీసుకురావద్దని గెస్ట్స్‌కు కండీషన్స్‌ పెడుతున్నారట కాబోయే దంపతులు రణ్‌వీర్‌ సింగ్‌ అండ్‌ దీపికా పదుకోన్‌. ఎందుకంటే పెళ్లికి సంబంధించి కాస్త ప్రైవసీ కావాలని చెబుతున్నారట. విరాట్‌ కోహ్లీ– అనుష్కాశర్మ, ఆనంద్‌ అహూజా– సోనమ్‌ కపూర్‌ల పెళ్లిళ్ల తర్వాత బీటౌన్‌లో జరగబోయే బిగ్‌ మ్యారేజ్‌ దీపికా–రణ్‌వీర్‌లదేనని బీటౌన్‌ టాక్‌. వీరిద్దరి వివాహం ఇటలీలో నవంబర్‌ 20న జరగనుందట.

సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యే ఈ వేడుకకు ఆల్రెడీ ఆహ్వానాలను అందించే పనిలో ఉన్నారు దీపికా. అలాగే పెళ్లి వేడుకకు మొబైల్స్‌ తీసుకు రావద్దని చెబుతున్నారట. అంటే పెళ్లికి వెళ్లిన అతిథులు వేడుకలో ఉండే ఆ కాసేపు సెల్‌ఫోన్స్‌కు సెలవు ఇవ్వాల్సిందే. అలాగే పెళ్లి వేడుకలో సెల్ఫీలు కూడా బంద్‌ అని ప్రత్యేకించి చెప్పకర్లేదు. ఈ మధ్య లుక్స్‌ రివీల్‌ అవుతాయని షూటింగ్‌ స్పాట్స్‌కు సెల్‌ఫోన్స్‌ను అనుమతించడం లేదు. ఇప్పుడు పెళ్లికి కూడా సెల్స్‌ఫోన్స్‌ బంద్‌ అంటే సోషల్‌ మీడియా ఔత్సాహికరాయుళ్ల ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top