పెళ్లి ఏర్పాట్లలో దీపికా, రణవీర్‌..!

Ranveer singh Deepika padukone - Sakshi

బాలీవుడ్ హాట్‌ కపుల్ దీపిక పదుకొనే, రణవీర్‌ సింగ్‌ల జోడిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నా.. ఈ జంట మాత్రం ఇంతవరకు తమ బంధంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వీరి ప్రైవేట్‌ పార్టీస్‌కు సంబంధించిన ఫొటోలు తెగ హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా సార్లు వీరి వివాహానికి సంబంధించిన వార్తలు మీడియా లో వినిపించాయి. తాజాగా మరోసారి ఈ జంట త్వరలోనే ఒక్కటవ్వబోతుందన్న వార్త తెర మీదకు వచ్చింది.

ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జోడి ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వాలని భావిస్తున్నారట. అది కూడా అత్యంత సన్నిహితుల మధ్య డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ తరహాలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్‌ అవుతున్నాయి. అంతేకాదు పెళ్లి తరువాత రెండు భారీ రిసెప్షన్‌లను కూడా ప్లాన్‌ చేస్తున్నారు. బాలీవుడ్ తారలు, వ్యాపార దిగ్గజాల కోసం ముంబైలో, తరువాత దీపిక పదుకొనే కుటుంబ సభ్యుల కోసం బెంగళూరులో రెండు రిసెప్షన్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై దీపికా, రణవీర్‌లు ఇంత వరకు అధికారంగా ఎలాంటి  ప్రకటనా చేయలేదు.

తాజాగా ఈ జోడి సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన పద్మావత్‌ సినిమాలో కలిసి నటించారు. ఎన్నో అవాంతరాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించటమే కాదు ఇప్పటికీ భారీ వసూళ్లను సాధిస్తూ సత్తా చాటుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top