చెంపదెబ్బ కొడితే చాలా ఆనంద‌ప‌డ్డా : రాజ్‌ అర్జున్‌

Dear Comrade Fame Raj Arjun Special Interview - Sakshi

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన సినిమా డియ‌ర్ కామ్రేడ్.భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శక‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై నిర్మించిన ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో ఇటీవల విడుదలైంది. కాగా, ఈ సినిమాలో ప్రతినాయ‌కుడి పాత్రలో రాజ్ అర్జున్ అనే బాలీవుడ్ న‌టుడు న‌టించారు. ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు రావటం పట్ట ఆనందం వ్యక్తం చేసిన రాజ్‌ అర్జున్‌, తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.

మీ సినీ రంగ‌ప్రవేశం ఎలా జరిగింది?
భోపాల్ మా సొంత ఊరు. చిన్నప్పటి నుంచి నాకు న‌ట‌న అంటే చాలా ఇష్టం. స్టేజ్‌ ఆర్టిస్ట్‌గా  కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. ఆ త‌ర్వాత ముంబ‌యిలో ప‌దిహేను సంవత్సరాలు ఉన్నాను.  కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో న‌టించాను కాని నాకు అమీర్‌ఖాన్ న‌టించిన సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌లో విల‌న్ క్యారెక్టర్‌లో చేశాను. ఆ పాత్ర నాకు మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ పాత్రతో నాకు ఒక యాక్టర్‌గా మంచి పేరు వ‌చ్చింది. 

డియ‌ర్ కామ్రేడ్‌లో అవ‌కాశం ఎలా వచ్చింది?
ద‌ర్శకుడు భ‌ర‌త్ క‌మ్మ సూప‌ర్ సీక్రెట్ సినిమా చూశారు. అందులో నా పెర్ఫార్మెన్స్ న‌చ్చి నాకు ఫోన్ చేసి పిలిపించారు. అలా ఆ సినిమా ద్వారా నాకు డియర్‌ కామ్రేడ్‌ అవ‌కాశం వ‌చ్చింది.

ఈ సినిమాలో మ‌హిళ‌ల‌ను వేధించే పాత్రలో న‌టించారు. .. నిజ జీవితంలో అలాంటివి ఎప్పుడైనా చూశారా?
ఇటువంటివి బ‌య‌ట నేను చాలానే చూశాను. ప్రస్తుతం మ‌న సొసైటీలో ఇలాంటివి చాలానే జ‌రుగుతున్నాయి. ఇంకా చాలా విన్నాను. బ‌ట్ నాకు ప‌ర్సన‌ల్‌గా అలాంటి ఎక్స్‌పీరియ‌న్స్ ఏమీ లేదు.

సినిమాల్లోకి రాక‌ముందు మీరు ఏమి చేసేవారు?
నేను భూపాల్‌లో ఉంటాను. నా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ కూడా అక్కడే ఉంటారు. మా ఫ్యామిలీ బిజినెస్ చూసుకునేవాడ్ని. ఇప్పటికీ ఆ బిజినెస్ ఉంది మా అన్నయ్య అవ‌న్నీ చూసుకుంటున్నారు.

విజ‌య్‌ దేవ‌ర‌కొండ‌తో ప‌ని చేయడం ఎలా అనిపించింది?
చాలా బావుంది. విజ‌య్ చాలా మంచి వాడు. ఎలాంటి వారినైనా గౌర‌విస్తాడు. చిన్నా,  పెద్దా అని చూడ‌డు. ప్రతి ఒక్కరినీ గౌర‌విస్తాడు.  సెట్స్‌లో కూడా అంద‌రితో బాగా క‌లిసిపోతాడు. షూటింగ్‌కి కూడా చాలా డెడికేటెడ్‌గా టైమ్‌కి వ‌స్తాడు. ఒక్కోసారి త‌న పంచువాలిటీ చూస్తే నాకే ఆశ్చర్యమేసేది. అత‌నికి మ‌ధ్యత‌ర‌గ‌తి విలువ‌లు బాగా తెలుసు. అంద‌రినీ త‌న వారిలో చూస్తాడు. నాకు ఎక్కడా నేను ఒక పెద్ద హీరోతో న‌టిస్తున్నాను అన్న ఫీలింగ్ క‌ల‌గ‌లేదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు.

ర‌ష్మిక క్లైమాక్స్‌లో మీ చెంప చెల్లుమ‌నిపించింది క‌దా అప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
ఫీల‌య్యానండి. చాలా  ఆనందంగా ఫీల‌య్యా. ఎందుకంటే సినిమాలో కొన్ని కొన్ని సీన్స్‌లో నేను చాలా ఇబ్బంది పెట్టా, చాలా టార్చర్ కూడా పెట్టాను. న‌ట‌న‌లో భాగంగానే మెంట‌ల్‌గా, ఫిజిక‌ల్‌గా త‌న‌ను చాలా ఇబ్బంది పెట్టాను. త‌ను సీన్ అయిపోయాక కూడా అర‌గంట వ‌ర‌కు ఏడ్చేది. నేను మ‌ళ్ళీ త‌న ద‌గ్గర‌కు వెళ్ళి చాలా సేపు మంచిగా మాట్లాడేవాడ్ని అవి కేవ‌లం సీన్స్ మాత్రమే నువ్వు బాధ‌ప‌డివుంటే న‌న్ను క్షమించు. బాధ‌ప‌డొద్దు అని చెప్పేవాడ్ని. ఆఖ‌రికి త‌ను న‌న్ను కొట్టినప్పుడు చాలా ఆనంద‌ప‌డ్డాను. హ‌మ్మయ్య.. త‌న కోపం అంతా పోయింది క‌దా అని. ఎక్కడా కూడా ఒక విల‌న్‌, హీరో, హీరోయిన్ ఫ్రెండ్స్ అవ్వరు.  కానీ ఈ సినిమాతో మేం ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. విజ‌య్, ర‌ష్మిక నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. 

ఇండ‌స్ట్రీ నుంచి మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్‌?
త‌మిళ , తెలుగు ఇండస్ట్రీల నుంచి మంచి కాంప్లిమెంట్స్ వ‌చ్చాయి.  త‌మిళ డైరెక్టర్ విజ‌య్, న‌టుడు కృష్ణ చాలా బాగా చేశార‌ని అభినందించారు. అలాగే సినిమా అయిపోయాక‌ కొంత మంది థియేట‌ర్‌లో న‌న్ను చూసిన ఆడ‌పిల్లలు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా కొంద‌రు భ‌య‌ప‌డ్డారు. నేను ఆ పాత్రకు త‌గ్గట్టే ఉన్నాన‌ని. కొంత‌మంది  న‌న్ను క్రూయ‌ల్ మెంటాలిటీ అని అనుకుంటున్నారు. దాదాపుగా ఈ మ‌ధ్య నేను న‌టించిన మూడు చిత్రాలు కూడా అలా నెగిటివ్ క్యారెక్టర్స్ కావ‌డంతో అలా అనుకుంటున్నారు.

మీకు త‌మిళ‌, తెలుగు, హిందీ ఇండ‌స్ట్రీల్లో ఏది కంఫ‌ర్ట్‌గా ఉంది?
రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో న‌టించిన షాభీ చిత్రం మంచిగా అనిపించింది. ఆ త‌ర్వాత సూప‌ర్ సీక్రెట్ కూడా ఓకే.  కాక‌పోతే నా వ‌రకు డియ‌ర్ కామ్రేడ్ తెలుగు ఇండ‌స్ట్రీ కంఫ‌ర్ట్ అనిపించింది.  ప్రొడ్యూస‌ర్ మంచి వారు. పెద్ద బ్యాన‌ర్ నాకు భాష రాక‌పోయినా ఇక్కడ ట్రీట్‌మెంట్ చాలా బావుంది. హైద‌రాబాద్ నాకు నా సొంత ఇల్లులా అనిపించింది. నా వ‌ర‌కు అయితే తెలుగు ఇండ‌స్ట్రీ కంఫ‌ర్ట్‌.

మీ త‌ర్వాత న‌టించే చిత్రాలు?
హిందీ  షీర్‌షా అనే చిత్రంలో న‌టిస్తున్నాను. కెప్టెన్ విక్రమ్ బాత్రా కార్గిల్ లైఫ్ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం. అందులో నేనొక ప్రత్యేక‌మైన పాత్రలో న‌టిస్తున్నాను. క‌ర‌ణ్‌ జోహ‌ర్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా?
డ్రీమ్ రోల్ అని ప్రత్యేకించి ఏమీ లేదు. కాని నేను న‌టించే పాత్రకి ఇంపార్టెన్స్ ఉండాలి.  క‌థ న‌చ్చి నా పాత్రకి ప్రాముఖ్యత ఉంటే ఏ పాత్రలోనైనా న‌టిస్తా.

మీకు తెలుగు రాదు క‌దా ఏమైనా ఇబ్బంది అయిందా?
లేదండి. నా డైలాగ్స్ అన్నీ ముందుగానే న్యారేట్ చేసేవారు. రాము డైలాగ్స్‌కి హెల్ప్ చేశారు. దాని పై చాలా పెద్ద హోమ్ వ‌ర్క్ చేసేవాడ్ని భాష గురించి ఎప్పుడూ అంత‌గా ఇబ్బంది క‌ల‌గ‌లేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top