27న గుమ్మడికాయ పాలాభిషేకం | Dead Line For Bharat Anu Nenu | Sakshi
Sakshi News home page

27న గుమ్మడికాయ పాలాభిషేకం

Feb 12 2018 3:57 AM | Updated on May 10 2018 12:13 PM

Dead Line For Bharat Anu Nenu - Sakshi

మహేశ్‌బాబు

అవును.. 27న ‘భరత్‌ అనే నేను’కి గుమ్మడికాయ కొట్టేస్తారట. ఏ 27న అంటే వచ్చే నెల అన్నమాట. ఆ రోజుకల్లా షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ చేసేసి, గమ్మడికాయ కొట్టేయనున్నారు. ఇక సినిమా రిలీజ్‌ రోజున అభిమాన హీరో కటౌట్స్‌కి ఫ్యాన్స్‌ ఎలానూ పాలాభిషేం చేస్తారు కదా. ఏప్రిల్‌ 27కి మహేశ్‌బాబు అభిమానులు పండగ చేసుకోవడానికి రెడీ అయిపోవచ్చు.

సీయం భరత్‌గా మహేశ్‌బాబు నటిస్తోన్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను మార్చి 27కల్లా కంప్లీట్‌ చేసి, ఏప్రిల్‌ 27న విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్‌ చేసినట్లు సమాచారం. శ్రీమంతుడు’ వంటి హిట్‌ సినిమా తర్వాత మహేశ్‌–కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే రిలీజ్‌ చేసిన ‘ఫస్ట్‌ ఓత్‌’ కు విశేష స్పందన లభించింది. మహేశ్‌ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తిరు, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్‌.

Advertisement
 
Advertisement
Advertisement