త్వరలో సూపర్ స్టార్ బయోపిక్ | daughters to make biopic of rajinikanth | Sakshi
Sakshi News home page

త్వరలో సూపర్ స్టార్ బయోపిక్

Aug 11 2016 10:48 AM | Updated on Sep 4 2017 8:52 AM

త్వరలో సూపర్ స్టార్ బయోపిక్

త్వరలో సూపర్ స్టార్ బయోపిక్

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా ఎదిగిన రజనీ జీవితంలోని ఎన్నో మలుపులు నేటి తరానికి...

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా ఎదిగిన రజనీ జీవితంలోని ఎన్నో మలుపులు నేటి తరానికి ఇన్సిపిరేషన్గా నిలుస్తాయి. అందుకే ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను, సవాళ్లను అభిమానులకు తెలియజేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రజనీ కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్యలు స్వయంగా రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రజనీ జీవితంపై పుస్తకం రాస్తున్న ఆయన కుమార్తె ఐశ్వర్య.. సినిమా రూపొందించే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. గతంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన 3 సినిమాకు దర్శకత్వం వహించిన ఈమే స్వయంగా రజనీ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

చాలా ఏళ్ల కిందటే రజనీ జీవితం ఆదారంగా సినిమాను నిర్మించాలని ప్లాన్ చేసినట్టుగా తెలిపారు ఐశ్వర్య. అయితే అప్పట్లో కుదరలేదని వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ను సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలిపారు. రజనీ పాత్రలో నటించే నటుడెవరన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement