తెలుగు నేలపై దంగల్ డైరెక్టర్ | dangal director nitesh tiwari to shoot a short film in amalapuram | Sakshi
Sakshi News home page

తెలుగు నేలపై దంగల్ డైరెక్టర్

May 30 2017 4:00 PM | Updated on Sep 5 2017 12:22 PM

తెలుగు నేలపై దంగల్ డైరెక్టర్

తెలుగు నేలపై దంగల్ డైరెక్టర్

రికార్డ్ కలెక్షన్లతో ఇండియాలోనే హయ్యస్ట్ గ్రాసర్ గా అవతరించిన దంగల్ చిత్ర దర్శకుడు నితీష్ తివారీ కోనసీమలో సందడి

రికార్డ్ కలెక్షన్లతో ఇండియాలోనే హయ్యస్ట్ గ్రాసర్ గా అవతరించిన దంగల్ చిత్ర దర్శకుడు నితీష్ తివారీ కోనసీమలో సందడి చేశారు. సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఓ లఘుచిత్రం కోసం నితీస్ ఆంద్రప్రదేశ్ కు వచ్చారు. తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న షార్ట్ ఫిలింను తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పరిసరప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తివారీ పచ్చదనంతో కూడిన ఇక్కడి ప్రకృతి తనకు ఎంతగానో నచ్చిందన్నారు. వ్యాపార వేత్త భాస్కర్ రెడ్డి ఈ లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement