ది టార్గెట్‌ | Dakshayagnam movie starts | Sakshi
Sakshi News home page

ది టార్గెట్‌

Mar 7 2020 5:40 AM | Updated on Mar 7 2020 5:40 AM

Dakshayagnam movie starts - Sakshi

‘దక్షయజ్ఞం’లో ఓ దృశ్యం

సూర్య, శివప్రసాద్, మధులగ్న, భవానీ చౌదరి, శ్రీధర్‌ రాజు, విడదాల శివ, బాతినేని శ్రీనివాస్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘దక్షయజ్ఞం’. ‘ది టార్గెట్‌’ అన్నది ఉపశీర్షిక. కృష్ణ తోట దర్శకుడు. మెట్రో స్టూడియోస్‌ ఈవీఎన్‌ చారి సారథ్యంలో కస్తూరి ఫిలిమ్స్, హంస క్రియేషన్స్‌పై వి. చిన్న శ్రీశైలం యాదవ్, బొర్ర జ్ఞానేశ్వర ముదిరాజ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వి. చిన్న శ్రీశైలం యాదవ్‌ మాట్లాడుతూ– ‘‘మా మిత్రుడు ఈవీఎన్‌చారిగారితో ఈ చిత్రం నిర్మించటం హ్యాపీ.

ఈ ఏడాది విజయవంతమైన చిత్రాల్లో ‘దక్షయజ్ఞం’ ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘యువత ఆశించే థ్రిల్లింగ్‌ అంశాలు మా చిత్రంలో ఉంటాయి’’ అన్నారు బొర్రా జ్ఞానేశ్వర ముదిరాజ్‌. ‘‘ఇప్పటి వరకూ 8 చిత్రాలు నిర్మించా.. ఈ కొత్త సంవత్సరంలో 9వ చిత్రం నిర్మిస్తున్నాను’’ అన్నారు ఈవీఎన్‌ చారి. ‘‘హత్య నేపథ్యంలో వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది’’ అన్నారు కృష్ణ తోట. ఈ చిత్రానికి సమర్పణ: మహతి సాయి జశ్వంత్, సంగీతం: ఘనశ్యాం, సహనిర్మాత: పి. శ్యామ్‌ రావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement