చూసినోడికి...కావాల్సినంత వినోదం | cusinodiki cusinanta movie audio released | Sakshi
Sakshi News home page

చూసినోడికి...కావాల్సినంత వినోదం

Oct 30 2014 10:40 PM | Updated on Jul 12 2019 4:42 PM

చూసినోడికి...కావాల్సినంత వినోదం - Sakshi

చూసినోడికి...కావాల్సినంత వినోదం

శివాజీ, నిత్య, లెజ్లీ త్రిపాఠీ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చూసినోడికి చూసినంత’. అనీల్ వాటుపల్లి దర్శకుడు. పి.శ్రీనివాసరావు నిర్మాత. సునీల్ కశ్యప్ స్వరాలందించిన

 శివాజీ, నిత్య, లెజ్లీ త్రిపాఠీ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చూసినోడికి చూసినంత’. అనీల్ వాటుపల్లి దర్శకుడు. పి.శ్రీనివాసరావు నిర్మాత. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన నటి నిషా కొఠారీ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని మరో అతిథి కోన వెంకట్‌కి అందించారు. సినిమా పరిశ్రమను నిలబెడుతున్నది చిన్న చిత్రాలే అని, తాను చిన్న సినిమాల పక్షపాతిని అని ఈ సందర్భంగా కోన వెంకట్ పేరొన్నారు. ట్రైలర్స్ బాగున్నాయని,     ఈ సినిమా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
 
 దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాకు అన్నీ కుదిరాయి. చూసినవారికి కావాల్సినంత వినోదం పంచే సినిమా ఇది. పాటలు బాగా వచ్చాయి. తప్పకుండా అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు. దర్శకుడు అనిల్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనీ, మంచి పబ్లిసిటీతో జనాలకు సినిమాను చేరువ చేస్తే విజయం తథ్యమనీ శివాజీ పేర్కొన్నారు. అందరి సహకారం వల్లే సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగానని నిర్మాత చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement