క్రూయల్ కోస్టార్! | cruel co star ! | Sakshi
Sakshi News home page

క్రూయల్ కోస్టార్!

Apr 1 2015 12:27 AM | Updated on Sep 26 2018 6:15 PM

క్రూయల్ కోస్టార్! - Sakshi

క్రూయల్ కోస్టార్!

వర్కింగ్ ప్లేస్‌లో మహిళలపై వేధింపులు వింటూనే ఉన్నాం. హాలీవుడ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కానట్టుంది! నటి కేట్ బ్లాంచెట్‌కు అలాంటి ఘటనే ఎదురైందట!

వర్కింగ్ ప్లేస్‌లో మహిళలపై వేధింపులు వింటూనే ఉన్నాం. హాలీవుడ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కానట్టుంది! నటి కేట్ బ్లాంచెట్‌కు అలాంటి ఘటనే ఎదురైందట! అయితే మగవారి నుంచి కాదు... సహ నటితోనే ఇబ్బందులు పడిందట! సదరు నటి పేరైతే చెప్పలేదు గానీ... ఆమె ప్రవర్తించిన తీరు తనకు ఓ భయానక అనుభవాన్ని మిగిల్చిందని చెప్పిందీ నలభై ఐదేళ్ల అమ్మడు.  ‘కెరీర్ బిగినింగ్‌లో ఈ సంఘటన జరిగింది.

ఎందుకో తెలియదు... ఆమె సంతోషంగా లేదు. అలాంటి సమయాల్లో కొందరు ఇలా క్రూయల్‌గా ప్రవర్తిస్తారు. అది మినహాయిస్తే నా కెరీర్‌లో ఇబ్బంది పడిన సంఘటనలేవీ లేవు’ అంటూ చెప్పుకొచ్చింది కేట్. కేట్ ముగ్గురు బిడ్డల తల్లి. ఇద్దరు అబ్బాయిలు... డాషిల్, రోమన్. భర్త అండ్రూ అప్టన్‌తో కలసి ఓ ఆడ పిల్లని దత్తత తీసుకుని మురిపెంగా పెంచుకుంటోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement