ఆ ముగ్గురు హీరోలు సర్దుకుపోతున్నారు! | compromise between nani sunil and sai sreenivas films | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురు హీరోలు సర్దుకుపోతున్నారు!

Jan 26 2016 1:28 PM | Updated on Aug 3 2019 12:59 PM

ఆ ముగ్గురు హీరోలు సర్దుకుపోతున్నారు! - Sakshi

ఆ ముగ్గురు హీరోలు సర్దుకుపోతున్నారు!

సంక్రాంతి సీజన్కు భారీ పోటి నెలకొనటంతో మంచి విజయం సాధించిన సినిమాలు కూడా కలెక్షన్ల రికార్డ్లు సృష్టించటంలో వెనకపడుతున్నాయి. దీంతో త్వరలో భారీ పోటికి సిద్దమవుతున్న...

సంక్రాంతి సీజన్కు భారీ పోటి నెలకొనటంతో మంచి విజయం సాధించిన సినిమాలు కూడా కలెక్షన్ల రికార్డ్లు సృష్టించటంలో వెనకపడుతున్నాయి. దీంతో త్వరలో భారీ పోటికి సిద్దమవుతున్న హీరోలు సర్థుకుపోయే ఉద్దేశంలో ఉన్నారట. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 5న మంచి అంచనాలున్న మూడు సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. అయితే సంక్రాంతి రిలీజ్తో ఆలోచనలో పడ్డ ఆ ముగ్గురు ఇప్పుడు డేట్లు సర్ధుబాటు చేసుకుంటున్నారు.

నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ, సునీల్ హీరోగా తెరకెక్కిన కృష్ణాష్టమి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెండో సినిమా స్పీడున్నోడు సినిమాలు ఫిబ్రవరి 5న రిలీజ్ చేయాలని భావించారు. అయితే భారీ పోటీ దృష్ట్యా థియేటర్లు సర్థుబాటు కాకపోవటంతో ఇప్పుడు వారానికి ఒక సినిమా చొప్పున రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రెండో సినిమా స్పీడున్నోడు ఫిబ్రవరి 5న రిలీజ్ అవుతుంది. ఆ తరువాత ఫిబ్రవరి 12న నాని, కృష్ణగాడి వీరప్రేమగాధ రిలీజ్ కానుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన సునీల్ కృష్ణాష్టమిని మరింత ఆలస్యంగా ఫిబ్రవరి 19న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement