భాగ్యనగర వీధుల్లో...

హాస్యనటుడు వై. శ్రీనివాసరెడ్డి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. సత్య, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రధారులు. చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అక్టోబరులో సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాకు రచయితగా చేసిన పరం సూర్యాన్షు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఈ సినిమాకు సంగీతం: సాకేత్ కొమండూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధనుంజయ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: చిత్రం శ్రీను.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి