దర్శకుడిగా మారనున్న కమెడియన్‌..! | Comedian Priyadarshi Wants Turn Director | Sakshi
Sakshi News home page

దర్శకుడిగా మారనున్న కమెడియన్‌..!

Feb 16 2019 12:27 PM | Updated on Feb 16 2019 12:27 PM

Comedian Priyadarshi Wants Turn Director - Sakshi

ఇటీవల కాలంలో నటులు కేవలం నటులుగానే మిగిలిపోయేందుకు ఇష్టపడటం లేదు. తమ అభిరుచికి తగ్గట్టుగా ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే కొంత మంది వ్యాపార రంగంలో సత్తా చాటుతుండగా మారికొందరు ఇండస్ట్రీలోనే నిర్మాతలుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో నటుడు చేరబోతున్నాడు.

పెళ్లిచూపులు సినిమాతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి, త్వరలో కొత్త అవతారం ఎత్తబోతున్నాడట. ఇప్పటి వరకు నటుడిగానే తెలిసిన ప్రియదర్శి.. దర్శకుడిగా మారనున్నాడు. ఈ విషయాన్ని మిఠాయ్‌ ఆడియో ఫంక్షన్‌లో దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ వెల్లడించాడు. అయితే గతంలో దర్శకత్వం చేసే ఆలోచన ఉన్నట్టుగా చెప్పిన ప్రియదర్శి ఈ వేదిక మీద మాత్రం ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement