సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు ఇంట్లో విషాదం | Cinematographer rathnavelu Mother Passed Away | Sakshi
Sakshi News home page

సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు ఇంట్లో విషాదం

Mar 21 2020 1:42 PM | Updated on Mar 21 2020 1:50 PM

Cinematographer rathnavelu Mother Passed Away - Sakshi

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు ఇంట్లో విషాదం నెలకొంది. రత్నవేలు తల్లి జ్ఞానేశ్వరి రామన్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం  తుదిశ్వాస విడిచారు. కాగా సౌత్‌ ఇండియాలోనే టాప్‌ మోస్ట్‌ సినిమాటోగ్రాఫర్లలో రత్నవేలు ఒకరు. చిరంజీవి, రజినీకాంత్‌ వంటి సూపర్‌స్టార్లు నటించిన సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఖైదీ నెం150, సైరా, రంగస్థలం, రోబో, సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు పనిచేశారు. (‘వీలు దొరక్కపోతే వీడియోకాల్‌ అయినా చేస్తా..’)

సుకుమార్‌ దర్శకత్వం వహించే అన్ని సినిమాలకు రత్నవేలే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు 2కి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇక రత్నవేలు తల్లి చనిపోవడంతో తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు రత్నవేలు కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement