పూర్తయిన సైరా షూటింగ్‌

Sye Raa Shooting Completed - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు శుభవార్త.. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న భారీ చారిత్రాత్మక చిత్రం ‘సైరా’ షూటింగ్‌ ముగిసింది. ఈ విషయాన్ని ‘సైరా’ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు నెటిజన్లతో పంచుకున్నారు. ఈ సందర్భంగా  షూటింగ్‌కు సహకరించిన ‘సైరా’ టీం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిందన్నారు. మొత్తానికి చిత్రం అద్భుతంగా వచ్చిందన్నారు.

చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా విజయ్‌ సేతుపతి, నయనతార వంటి బడా స్టార్లు కూడా భాగమయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాత కాగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కోసం ఫిల్మ్‌ దునియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖైదీ నంబర్‌ 150 సినిమాతో భారీ హిట్‌ కొట్టిన చిరంజీవి సైరాతో మరోసారి రికార్డులు బ్రేక్‌ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top