సైరా : గ్రాఫిక్స్‌కే భారీగా..!

Chiranjeevi Sye Raa Narasimha Reddy Special Effects Budget Revealed - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ నిర్మిస్తున్నారు. తండ్రి డ్రీమ్‌ ప్రాజెక్ట్ కావటంతో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

చారిత్రక కథ కావటం, భారీ యుద్ధ సన్నివేశాలు ఉండటంతో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసమే పెద్ద మొత్తం ఖర్చవుతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం గ్రాఫిక్స్‌ కోసమే 45 కోట్లు ఖర్చు చేస్తున్నారట సైరా టీం. 17 దేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ జరుగుతోంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, సుధీప్‌, జగపతి బాబు, విజయ్ సేతుపతి, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు థియెట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top