‘సైరా’ రిలీజ్ ఈ ఏడాది లేనట్టే!

Chiranjeevi Sye raa Narasimha Reddy Release Pushed to 2020 - Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

ముందుగా ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ గ్రాఫిక్స్ వర్క్‌ భారీగా ఉండటంతో గాంధీ జయంతి (అక్టోబర్‌ 2)కి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ తాజా సమాచారం ప్రకారం సైరా అక్టోబర్‌లో కూడా రిలీజ్‌ కావటం కష్టమే అన్న అన్న టాక్‌ వినిపిస్తోంది.

గ్రాఫిక్స్‌ భారీగా ఉండటంతో అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తవుతాయా లేదా అన్న ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సినిమా కావటంతో ప్రచార కార్యక్రమాలకు కూడా ఎక్కువ సమయం తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు ఎలాంటి హడావిడి లేకుండా సినిమాను 2020 జనవరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top