నెక్ట్స్‌ ఫిక్స్‌? | Chiranjeevi starrer Acharya is director Koratala Siva | Sakshi
Sakshi News home page

నెక్ట్స్‌ ఫిక్స్‌?

Apr 23 2020 2:42 AM | Updated on Apr 23 2020 2:42 AM

Chiranjeevi starrer Acharya is director Koratala Siva - Sakshi

ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో 152వది. చిరంజీవి హీరోగా నటించే 153వ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే చర్చ జరుగుతోంది. దర్శకులు మెహర్‌ రమేష్, సుజిత్, కేఎస్‌ రవీంద్ర (బాబీ)లతో సినిమాలు చేయాలనుకుంటున్నానని చిరంజీవి ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు. మరి ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరి కథతో ఆయన 153వ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందంటే దర్శకుడు బాబీ చెప్పిన కథ అని తాజా సమాచారం. బాబీ స్టోరీ మొత్తం రెడీ చేసి, చిరంజీవికి వినిపించారట. కథ నచ్చి, చిరంజీవి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement