ఖైదీ నంబర్ 150లో చిరు సెకండ్ లుక్..! | Chiranjeevi Second Role Look in Khaidi number 150 | Sakshi
Sakshi News home page

ఖైదీ నంబర్ 150లో చిరు సెకండ్ లుక్..!

Jan 8 2017 1:02 PM | Updated on Sep 5 2017 12:45 AM

ఖైదీ నంబర్ 150లో చిరు సెకండ్ లుక్..!

ఖైదీ నంబర్ 150లో చిరు సెకండ్ లుక్..!

దాదాపు దశాబ్దకాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా ఖైదీ నంబర్ 150. మెగా రీ ఎంట్రీగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ కత్తికి రీమేక్ అన్న

దాదాపు దశాబ్దకాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా ఖైదీ నంబర్ 150. మెగా రీ ఎంట్రీగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ కత్తికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన కత్తి తమిళ నాట వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే సినిమాను కొద్ది పాటి మార్పులతో చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే వరకు ఖైదీ ట్రైలర్స్ చిరంజీవి ఒక క్యారెక్టర్ కు సంబంధించిన గెటప్స్ మాత్రమే చూపిస్తూ వచ్చారు. చిరు ఇమేజ్ కు తగ్గట్టుగా మాస్ సీన్స్ ఉన్న క్యారెక్టర్ నే ట్రైలర్ లో రివీల్ చేశారు. కానీ కీలక మైన రెండో పాత్రలో చిరు హైడ్రాలజీలో పోస్ట్ గ్రాడ్యూయెట్ చేసి తన ఊరి దాహార్తిని తీర్చడానికి పోరాడే నాయకుడు కే శంకర్ గా కనిపించనున్నాడు. క్లాస్ లుక్లో కనిపిస్తున్న రెండో పాత్రను రివీల్ చేయకపోయినా ట్రైలర్ లో కొన్ని క్షణాల పాటు ఈ క్యారెక్టర్ కనిపించింది. రీ ఎంట్రీలో తన మార్క్ మాస్ లుక్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు చిరు.

Advertisement
 
Advertisement
Advertisement