150వ సినిమా కోసం చిరంజీవి ఫొటో షూట్! | Chiranjeevi photo shoot for150th movie! | Sakshi
Sakshi News home page

150వ సినిమా కోసం చిరంజీవి ఫొటో షూట్!

Aug 21 2014 4:12 PM | Updated on Sep 2 2017 12:14 PM

ఫొటో షూట్ లో పాల్గొన్న చిరంజీవి

ఫొటో షూట్ లో పాల్గొన్న చిరంజీవి

అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా కార్యక్రమాలు మొదలయ్యాయి.

హైదరాబాద్: అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ చిత్రం కోసం చిరంజీవి ఫొటో షూట్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు చూస్తుంటే చిరంజీవి పది సంవత్సరాలు వెనుకకు వెళ్లినట్లుగా ఉన్నారు. చాలా స్లిమ్గా తయారయ్యారు. ఈ సినిమా అనుకున్న తరువాత ఆయన ప్రతిరోజూ దాదాపు మూడు గంటలపాటు జిమ్లోనే గడుపుతున్నారు.

చిరంజీవి గతంలో నటించిన సినిమాలకు భిన్నంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. రాజకీయాలు ఏమీ లేకుండా పూర్తి హాస్యభరితంగా చిత్రం రూపొందించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కృష్ణ వంశీ, శ్రీను వైట్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో తండ్రితోపాటు రామ్ చరణ్ తేజ కూడా నటించే అవకాశం ఉంది.  పరుచూరి సోదరులు కథ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement