కాటమరాయుడు సెట్లో ఖైదీ | Chiranjeevi Meets Pawan Kalyan at Katamarayudu Sets | Sakshi
Sakshi News home page

కాటమరాయుడు సెట్లో ఖైదీ

Nov 3 2016 12:52 PM | Updated on Mar 22 2019 5:33 PM

కాటమరాయుడు సెట్లో ఖైదీ - Sakshi

కాటమరాయుడు సెట్లో ఖైదీ

చాలా కాలం తరువాత మెగా ఫ్యామిలీలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మధ్యలో ఒకటి రెండు సార్లు...

చాలా కాలం తరువాత మెగా ఫ్యామిలీలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మధ్యలో ఒకటి రెండు సార్లు చిరు, పవన్ లు కలిసినా.. అంతా ఓకె అన్న భావన మాత్రం కలిగించలేకపోయారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల సినీ వేడుకలలో, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో పవన్ కనిపించకపోవటంతో ఏదో జరుగుతుందన్న భావనలో ఉన్నారు ఫ్యాన్స్.

అయితే ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కాటమరాయుడు సెట్ లో సందడి చేస్తున్నాడు. ఊరికే కాదులేండి..ఖైదీ నంబర్ 150 సినిమాలోని కొన్ని సీన్స్ ను కాటమరాయుడు సెట్ లో షూట్ చేస్తున్నారట. ఈ సందర్భంగా ఒకే సెట్ లో కలుసుకున్న చిరు, పవన్ లు గంటపాటు విడిగా మాట్లాడుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే చర్చ సంగతి అటుంచితే.. మెగా బ్రదర్స్ ఇద్దరు ఒకే సెట్ లో షూటింగ్ చేస్తున్నారన్న వార్తలతో మెగాఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement