ఆచార్య... లుక్‌ అదుర్స్‌

 Chiranjeevi Look Leaked From Acharya Movie - Sakshi

ప్రత్యర్థులపై పులిలా పంజా విసురుతున్నారట చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోలవరం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోందని సమాచారం.

చిరంజీవిపై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అయితే తాజాగా ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి లుక్‌ ఇదేనంటూ ఓ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక్కడున్న ఫొటో చూసిన చిరంజీవి అభిమానులు ‘ఆచార్య.. లుక్‌ అదిరిందయ్యా!’ అంటున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లు ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top