తెలంగాణ గవర్నర్‌ బర్త్‌డే: చిరంజీవి విషెస్‌ | Chiranjeevi Greets People On Telangana State Formation Day | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రజలకు చిరు విషెస్‌

Jun 2 2020 11:14 AM | Updated on Jun 2 2020 11:17 AM

Chiranjeevi Greets People On Telangana State Formation Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ట్విటర్‌ వేదికగా రాజకీయ, సినీ ప్రముఖులు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత శ్రీ కేసీఆర్‌ గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. అదేవిధంగా ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌కు చిరంజీవి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. (తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నివాళి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement