‘చిత్రలహరి’పై చిరు కామెంట్స్‌ | Chiranjeevi Comments On Chitralahari Movie | Sakshi
Sakshi News home page

‘చిత్రలహరి’పై చిరు కామెంట్స్‌

Apr 15 2019 3:45 PM | Updated on Apr 15 2019 7:25 PM

Chiranjeevi Comments On Chitralahari Movie - Sakshi

వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమైన మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు చిత్రలహరి కాస్త ఊరటనిచ్చినట్టు కనిపిస్తోంది. గత చిత్రాల కంటే ఈ సినిమా ఫర్వాలేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అయితే చిత్రలహరిపై భిన్నాభిప్రాయాలు వస్తుండగా.. మూవీకి ప్రమోషన్‌ను కల్పించే క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వీడియో రూపంలో తెలిపారు.

చిత్రలహరి గురించి చిరంజీవి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌ చాలా చక్కగా, పరిణితితో నటించాడని, డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల మంచి సందేశాన్నిచ్చే చిత్రాన్ని చక్కగా రూపొందించారని, మైత్రి మూవీస్‌ సంస్థకు తగ్గట్టుగా ఈ సినిమాను వారు నిర్మించారని తెలిపారు. ఈ మూవీలో నటించిన మిగతా పాత్రల గురించి కూడా తనదైన శైలిలో కామెంట్‌ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్‌ మరోసారి తన సంగీతంతో సత్తా చాటారని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement