మెగాస్టార్, సూపర్‌స్టార్‌ ప్రశంసలు | Chiranjeevi And Mahesh Babu Praised Gaddala Konda Ganesh Movie | Sakshi
Sakshi News home page

‘గద్దలకొండ గణేష్’ని అభినందించిన మెగాస్టార్, సూపర్‌స్టార్‌

Sep 24 2019 7:00 PM | Updated on Sep 24 2019 7:53 PM

Chiranjeevi And Mahesh Babu Praised Gaddala Konda Ganesh Movie - Sakshi

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన 'గద్దలకొండగణేష్‌' సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. రిలీజ్‌ అయిన ప్రతీ చోట కలెక్షన్లతో దుమ్ముదులుపుతోంది. 

ఈ రోజు(సెప్టెంబర్ 24) ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన మెగాస్టార్ చిరంజీవి..  వరుణ్ పెర్ఫార్మన్స్ చాలా బాగుందని, హరీష్ శంకర్ చాలా బాగా తీశాడు, డైలాగ్స్ చాలా బాగున్నాయని అన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మాతలు ఈ చిత్రాన్నితీశారని కొనియాడారు. సినిమాలో టీం స్పిరిట్ కనిపిస్తోందని ఆయన ప్రశంసిస్తూ ఈ అద్భుత విజయాన్ని సాధించిన టీం అందరికీ విజయాభినందనలు తెలిపారు.

‘గద్దలకొండ గణేష్’ చూస్తూ బాగా ఎంజాయ్ చేశానని. వరుణ్ తేజ్ గణేష్‌గా అద్భుతంగా నటించాడని సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తెలిపాడు. హరీష్ శంకర్, 14 రీల్స్ సినిమాని చాలా బాగా తెరకెక్కించారని, అలాగే మంచి సక్సెస్ ను అందుకున్న చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్కి హీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు రామ్, గోపి థాంక్స్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement