మెగా బర్త్‌డే గిఫ్ట్‌! | Chiranjeevi And Kortala Siva Movie to Launch on Megastar Birthday | Sakshi
Sakshi News home page

మెగా బర్త్‌డే గిఫ్ట్‌!

Jun 1 2019 3:51 PM | Updated on Jun 1 2019 3:51 PM

Chiranjeevi And Kortala Siva Movie to Launch on Megastar Birthday - Sakshi

బాక్ల్‌ బస్టర్‌ సక్సెస్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, వరుస సినిమాలకు ఓకె చెప్పాడు. ప్రస్తుతం భారీ చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్న చిరు, తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు నెక్ట్స్ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రకటించేశారు.

అయితే ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరు డ్యూయల్ రోల్‌ చేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై చిరు తనయుడు రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement