మరో ప్రేమకథతో... | Chinnadaana Neekosam audio release on 27th november | Sakshi
Sakshi News home page

మరో ప్రేమకథతో...

Nov 16 2014 11:12 PM | Updated on Sep 2 2017 4:35 PM

మరో ప్రేమకథతో...

మరో ప్రేమకథతో...

ప్రేమకథల వైపు అడుగులేయడం నితిన్ ఎప్పుడు మొదలుపెట్టారో... అప్పట్నుంచి ఆయన్ను విజయాలు వరించడం మొదలుపెట్టాయి.

 ప్రేమకథల వైపు అడుగులేయడం నితిన్ ఎప్పుడు మొదలుపెట్టారో... అప్పట్నుంచి ఆయన్ను విజయాలు వరించడం మొదలుపెట్టాయి. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్‌ఎటాక్... విజయాలే అందుకు నిదర్శనాలు. ప్రస్తుతం నితిన్ చేస్తున్న మరో ప్రేమకథ ‘చిన్నదాన నీ కోసం’. ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకుడు. నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాతలు సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి మాట్లాడుతూ-‘‘కరుణాకరన్ మార్క్ స్టోరీ ఇది. నితిన్ గత విజయాలకు దీటుగా ఈ సినిమా ఉంటుంది. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ నెల 27న పాటల్నీ, డిసెంబర్ 19న సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. మిస్తీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్,  కెమెరా: ఐ.ఆండ్రూ, సమర్పణ: విక్రమ్ గౌడ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement