కూతురికి ప్రేమతో... | Sakshi
Sakshi News home page

కూతురికి ప్రేమతో...

Published Mon, May 30 2016 10:45 PM

కూతురికి ప్రేమతో...

సినిమా ఇండస్ట్రీలో వారసులను హీరోలుగా పరిచయం చేసి, వాళ్లు నిలదొక్కుకునేలా సపోర్ట్‌గా నిలిచేందుకు హీరోలు, నిర్మాతలు, దర్శకులు.. ఇలా అందరూ దాదాపు ముందుంటారు. కొడుకులను హీరోలను చేసినంత ఇష్టంగా కూతుళ్లను హీరోయిన్లను చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కొంతమంది మాత్రమే కూతుళ్లను కూడా ప్రోత్సహిస్తుంటారు. అలాంటివారిలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒకరు. ఆయన కుమార్తె ఐశ్వర్య ‘పట్టత్తు యానై’ అనే తమిళ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు.

ఆ తర్వాత స్వీయదర్శకత్వంలో తన తండ్రి నటించి, నిర్మించిన ‘జైహింద్ -2’కు ఆమె సహనిర్మాతగా వ్యవహరించారు. తొలి చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఐశ్వర్యకు కథానాయికగా తదుపరి ఆశించినంతగా అవకాశాలు రాలేదట. అందుకని కూతుర్ని హీరోయిన్‌గా నిలబెట్టాలని అర్జున్ రంగంలోకి దిగారు. స్వయంగా తాను రాసుకున్న ఓ ప్రేమకథను చేతన్, ఐశ్వర్య జంటగా స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు అర్జున్. ‘‘ఇందులో నేను ఓ లీడ్ రోల్‌లో కనిపిస్తా. వచ్చే ఏడాది జనవరిలోపు షూటింగ్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని అర్జున్ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement