అమెరికాలో ఛేజ్! | chase movie shot in america | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఛేజ్!

Sep 23 2014 11:01 PM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో ఛేజ్! - Sakshi

అమెరికాలో ఛేజ్!

రామ్ దివ్యేష్, స్పందన అల్లూరి ముఖ్య తారలుగా పద్మలత సమర్పణలో స్వీయదర్శకత్వంలో మోహన్ నిమ్మకాయల నిర్మిస్తున్న చిత్రం ‘చేజ్’. ప్రస్తుతం నిర్మాణా నంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 రామ్ దివ్యేష్, స్పందన అల్లూరి ముఖ్య తారలుగా పద్మలత సమర్పణలో స్వీయదర్శకత్వంలో మోహన్ నిమ్మకాయల నిర్మిస్తున్న చిత్రం ‘చేజ్’. ప్రస్తుతం నిర్మాణా నంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శక, నిర్మాత మోహన్ మాట్లాడుతూ -‘‘హాలీవుడ్ చిత్రం ‘సమ్‌టైమ్స్ ఇన్ లైఫ్’కి నిర్మాతగా, సెకండ్ యూనిట్ డెరైక్టర్‌గా చేశాను. ఈ చిత్రం మొత్తం అమెరికాలోనే తీశాం. ఓ చేజ్ నేపథ్యంలో సాగే ఈ కథ ఆద్యంతం ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ టామ్ హెన్రి ఆధ్వర్యంలో చిత్రీకరించాం. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement