అందంతో పాటు మంచి మనసున్న నటి | Sakshi
Sakshi News home page

అందంతో పాటు మంచి మనసున్న నటి

Published Wed, Jul 6 2016 5:40 PM

అందంతో పాటు మంచి మనసున్న నటి - Sakshi

హైదరాబాద్:  అందమైన హీరోయిన్ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి అని టాలీవుడ్ ముద్దుగుమ్మ ఛార్మి నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆమె షార్ట్ హెయిర్ తో వెరీ క్యూట్ గా కనిపిస్తున్నారు. దీనివెనక ఓ మంచిపని దాగుంది. సాధారణంగా ఆడవాళ్లు తమ కేశాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే! అయితే క్యాన్సర్ తో బాధపడుతున్న బాధితులకు సహాయం చేయాలని ఛార్మింగ్ హీరోయిన్ ఛార్మి భావించారు.

క్యాన్సర్ బాధితులకు విగ్గులు తయారు చేసే సంస్థకు తన కేశాలు అందించారు. బేబీ కటింగ్ చేయించుకుని ఆ కత్తెర పడ్డ వెంట్రుకలను కొందరు మహిళలకు తయారుచేసే విగ్గుల కోసం వినియోగించనున్నారు. క్యాన్సర్ బారిన పడ్డ వారికి చేసే కీమోథెరపి చికిత్సలో భాగంగా వారు తమ కేశాలను కోల్పోయి ఎంతో ఆందోళన చెందుతుంటారు. వారికి తనవంతు సహాయంగా కొంత మేరకు జుట్టును ఛార్మి అందించారు. ఈ విషయం తెలిసిన చాలా మంది అభిమానులు ఛార్మి అందంతోనే కాదు మంచి మనసుతోనూ ఆకట్టుకుంటుందని అభినందిస్తున్నారు. కాగా, గతంలో నటి రేణు దేశాయ్ ఇదే తరహాలో క్యాన్సర్ బాధిత మహిళల కోసం తన కేశాలను అందించి సహాయం చేసిన విషయం తెలిసిందే. ఇలాగే మరి కొంతమంది హీరోయిన్లు ముందుకొస్తే ఎంతో కొంత మార్పు అనేది సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

Advertisement
Advertisement