నాలుగో బ్యూటీ | Catherine Tresa Fourth Heroin For Vijay Devarakonda | Sakshi
Sakshi News home page

నాలుగో బ్యూటీ

Feb 4 2019 2:39 AM | Updated on Feb 4 2019 2:39 AM

Catherine Tresa Fourth Heroin For Vijay Devarakonda - Sakshi

కేథరిన్‌ థెరీసా

ఆల్రెడీ ముగ్గురు హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తున్న విజయ్‌ దేవరకొండ లేటెస్ట్‌ మూవీలోకి కేథరిన్‌ థెరీసా కూడా జాయిన్‌ అయ్యారు. క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు సమర్పణలో కేఎస్‌ వల్లభ నిర్మిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా నాలుగో బ్యూటీగా కేథరిన్‌ కూడా తోడయ్యారు. ప్రస్తుతం కొత్తగూడెంలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సింగరేణి కార్మికుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ షెడ్యూల్‌లో కేథరిన్‌ కూడా పాల్గొంటున్నారు. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement