ఎన్టీఆర్‌ బయోపిక్‌.. ప్రధాన సమస్య అదే! | Casting Issue for NTR Biopic | Sakshi
Sakshi News home page

Feb 4 2018 1:25 PM | Updated on Aug 29 2018 1:59 PM

Casting Issue for NTR Biopic - Sakshi

సాక్షి, సినిమా : ఇంకా సెట్స్‌ మీదకు వెళ్లక ముందే ఎన్టీఆర్‌ బయోపిక్‌ దర్శకుడు తేజకు ముచ్చెమటలు పోయిస్తోంది. ముఖ్యంగా తారాగణం విషయంలోనే దర్శకుడు గందరగోళంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నటీనటులకు సంబంధించి ఒక్క బాలయ్య మినహాయించి ఇంత దాకా ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. 

ఎన్టీఆర్‌ జీవితంలోని పాత్రలకు దగ్గరి పోలికలు ఉండాలన్న కారణంగానే కాస్టింగ్‌ ఎంపికలోనే జాప్యం జరుగుతోంది. ఇందుకోసం హాలీవుడ్‌ నుంచి వచ్చిన ఓ టీమ్‌ చాలా కష్టపడింది. ఇప్పటిదాకా మొత్తం 72 పాత్రలకు సంబంధించిన నమునాలను(స్కెచ్‌లను) వారు అందజేశారంట. దీంతో వాటికి తగ్గట్లు ఉండే వ్యక్తులను ఎంపిక చేసే పనిలో తేజ బిజీగా ఉన్నాడు. ఈ పనుల మూలంగానే ‘ఎన్టీఆర్‌’ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లటం ఆలస్యమౌతోంది.

మరోవైపు బయోపిక్‌ పనుల జాప్యంపై బాలయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నాడనే మరో వార్త వినిపిస్తోంది. ఏది ఏమైనా వీలైనంత త్వరలో చిత్రాన్ని లాంఛ్‌ చేసి రూమర్లకు పుల్‌ స్టాప్‌ పెట్టాలని తేజ డిసైడ్‌ అయ్యాడు. అదే రోజు టీజర్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 60 కోట్ల బడ్జెట్‌తో ‘ఎన్టీఆర్‌’ తెరకెక్కనుంది.

Advertisement
 
Advertisement
Advertisement