‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌

Casting Call For Shankar And Kamal Hassan Indian 2 Movie - Sakshi

భారతీయ దిగ్గజ దర్శకుల్లో శంకర్‌ ఒకరు. సామాజిక సందేశంతో నిండి.. అందరూ మెచ్చే చిత్రాన్ని తెరకెక్కించడం ఈయన ప్రత్యేకం. గతేడాది 2.ఓ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శంకర్‌.. కమల్‌ హాసన్‌ హీరోగా భారతీయుడు-2 మూవీని డైరెక్ట్‌ చేయనున్నాడు. అయితే షూటింగ్‌ కూడా ప్రారంభించేసిన చిత్రయూనిట్‌.. కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్‌ అయిపోయింది. దీంతో ఆ ప్రాజెక్ట్‌ ఇక పట్టాలెక్కబోదని వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా ఈ మూవీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను హీరోయిన్‌ ఎంచుకున్నారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు నటీనటులు కావలెను అని ఓ ప్రకటనను విడుదల చేసింది చిత్రబృందం. ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యులు కావాలని అనుకునేవారు.. తమ ప్రొఫైల్‌ను ఈమెయిల్‌ (casting.indian2@gmail.com) చేయాలని తెలిపారు. ఈ చిత్రం ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top